రోడ్డు నిర్మాణ పనులను స్పీడప్ చేయాలి..    ఎమ్మెల్యే మందుల సామేలు

రోడ్డు నిర్మాణ పనులను స్పీడప్ చేయాలి..    ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి,  వెలుగు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.

బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం నుంచి అలుగునూరు గ్రామానికి చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే రోడ్డు పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాచనపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.